రామ్ చరణ్ ఒక ఆట కూలి! మరి ధోని ఏంటి!
on Mar 17, 2025

గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram charan)తన గత చిత్రం 'గేమ్ చేంజర్'(Game Changer)తో అభిమానులని,ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేకపోయాడు.దీంతో ఉప్పెన ఫేమ్ 'బుచ్చిబాబు'(Buchibabu)దర్శకత్వంలో చేస్తున్న మూవీతో ఈ సారి బ్లాక్ బస్టర్ అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఆర్ సి 16(Rc16)అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పలు ఆటలు తెరమీదకి వచ్చాయి.కానీ, ఈ మూవీకి ఫొటోగ్రఫీ అందిస్తున్న రత్నవేలు చేసిన ట్వీట్ తో క్రికెట్ నేపధ్యం అనే విషయం అర్ధమయ్యింది.రీసెంట్ గా సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం క్రికెట్ మాత్రమే కాకుండా,కబడ్డీ, కుస్తీతో పాటు మరికొన్ని ఆటలు ఉండబోతునట్టుగా తెలుస్తుంది.ఇన్ని ఆటలు ఎందుకుంటాయనే సందేహం రావచ్చు.కథ ప్రకారం చరణ్ ఆట కూలీగా కనిపించబోతున్నాడంట.ఆట కూలి అంటే కొంతమంది స్పాన్సర్స్ ఆటలో బాగా నైపుణ్యం ప్రదర్శించే ప్లేయర్ ని అమౌంట్ కి కొనుక్కొని తమ తరుపున ఆడించుకుంటారు.ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ఐపీఎల్ నే ఇందుకు ఉదాహరణ.ఆర్ సి 16 ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కుతుంది.మరి ఆ టైంలో స్పాన్సర్స్ ఉన్నారా! లేక వేరే ఎవరైనా చరణ్ ని కొనుక్కుంటారా! ఒకవేళ స్పాన్సర్స్ ఉంటే ఏ విధంగా ఉంటారు.! పైగా చాలా గేమ్స్ ఉన్నాయని అంటున్నారు కాబట్టి ఆ గేమ్స్ లో చరణ్ ఎలాంటి లుక్స్ లో కనిపించబోతున్నాడు లాంటి వార్తలు ఇప్పుడు ప్రేక్షకుల్లో మూవీపై అంచనాలు పెంచేసాయి.
ఇక ఈ మూవీలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్,స్టార్ క్రికెటర్ ధోనీ(ధోని) నటిస్తున్నాడనే వార్త కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.ధోని నిర్మాతగా కొన్ని సినిమాలని ప్రేక్షకులకి అందించాడు.చరణ్,ధోని కూడా మంచి ఫ్రెండ్స్.కాబట్టి ఆర్ సి 16 లో ధోని నటించడం ఖాయమని అందరు అనుకున్నారు.కానీ ధోని తమ సినిమాలో లేడని,అవన్నీ ఒట్టి పుకార్లని స్వయంగా చరణే వెల్లడించటం జరిగింది.అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఆర్ సి 16 లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుండగా ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.పాన్ ఇండియా నటీనటులు భాగస్వామ్యం కానున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



