ఎంగేజ్మెంట్ విషయంలో అనుకున్నదే జరిగింది.. వాళ్ళకి మాత్రం మైండ్ బ్లాంక్
on Oct 28, 2025

- ఎంగేజ్మెంట్ పై స్పందించిన రష్మిక
- ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉండబోతుంది!
- విజయ్ దేవరకొండ ఆశలన్నీ నెక్స్ట్ చిత్రాల పైనే
- మీకు ఏమనిపిస్తుందో అదే నిజం
సినిమా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ న్యూస్ తెలుసుకోవాలనే ఆసక్తిలేనివారు ఈ భూమ్మీద ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా అభిమానులు,ప్రేక్షకులలో నిత్యం కొంత మంది స్టార్స్ ల పర్సనల్ విషయంపై చర్చ జరుగుతు ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో రష్మిక, విజయ్ దేవరకొండ ఫెయిర్ ఒకటి. ఈ ఇద్దరు లవ్ లో ఉన్నారనే వార్తలు ఎప్పట్నుంచో వస్తున్నాయి. కానీ ఈ ఇద్దరు ఎప్పుడు అధికారకంగా వెల్లడి చెయ్యలేదు.
ఇద్దరు జంటగా టూర్స్ కి వెళ్లడం, సినిమా ఫంక్షన్స్ లో ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని బహిరంగంగానే చెప్పుకోవడమే కానీ, తమ మధ్య నడిచే విషయాన్ని మాత్రం బహిరంగంగా వెల్లడి చెయ్యడం లేదు. కొన్ని రోజుల క్రితం ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. ఎంగేజ్మెంట్ ఖాయంగా జరిగిందని అన్ని మీడియా ఛానల్స్ అధికారకంగా ద్రువీ కరించాయి. కానీ ఫొటోస్ మాత్రం బయటకి రాలేదు. దీంతో ఎంగేజ్మెంట్ విషయంపై ఆ ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తారేమో అని అభిమానులు ఎదురుచూస్తు వస్తున్నారు. వాళ్ళు అందరు ఎదురుచూస్తునట్టుగానే ఎంగేజ్మెంట్ విషయంపై రష్మిక స్పందించింది.
రీసెంట్ గా రష్మిక తన అప్ కమింగ్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్'(The Girl friend)ప్రమోషన్స్ నిమిత్తం ఒక మీడియా సమావేశంలో పాల్గొంది. రష్మిక అభిమానులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక అభిమాని ఎంగేజ్మెంట్ గురించి ప్రస్తావించడం జరిగింది. సదరు అభిమాని ప్రశ్నకి రష్మిక స్పందిస్తు 'ఎప్పుడు చెప్పాలో అప్పుడు బదులిస్తాను. ఈ విషయంలో మీకు ఏమనిపిస్తుందో అదే నిజం అని చెప్పుకొచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ తో రష్మిక ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్నీ ద్రువీకరించినట్లయింది. యాంటి ఫ్యాన్స్ కి మాత్రం మైండ్ బ్లాంక్ అయినంత పని అయ్యింది.
Also Read: కాంతార చాప్టర్ 1 ఇక్కడ రికార్డు.. అక్కడ లాస్
రష్మిక, విజయ్ దేవరకొండ(Vijay deverakonda)ల కెరీర్ పరంగా చూసుకుంటే ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ప్రచార చిత్రాలు బాగుండటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ తన గత చిత్రం కింగ్ డమ్ తో పరాజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం రవికాంత్ కోలా, రాహుల్ సంక్రుత్యియన్ చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



