రష్మిక రాజకీయాల్లోకి వస్తుందా..ముందు కారు దిగడం నేర్చుకోవాలి
on May 16, 2024
రష్మిక (rashmika) సినీ ప్రయాణం ఇప్పుడు మంచి జోరు మీద ఉంది. వరుసగా హిట్ లు మీద హిట్ లు కొడుతు పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. చాలా తక్కువ టైం లోనే ఆ ఘనతని సాధించడంతో పాటు సెటిల్డ్ పెర్ ఫార్మెన్స్ తో భారీ స్థాయిలో అభిమానుల్ని పొందింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఇప్పుడు అది రాజకీయ వాసనని తెస్తుంది
అటల్ సేతు(atal setu)..దేశంలోనే అతి పెద్ద మూడవ బ్రిడ్జ్. జపాన్ దేశ సహకారంతో ముంబై లోని సముద్రం మీద దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ కి రష్మిక కి సంబంధం ఏంటనుకుంటున్నారా. అటల్ సేతు ని పొగుడుతు రష్మిక ట్వీట్ చేసింది.రెండు గంటల ప్రయాణాన్ని ఇరవై నిమిషాల్లో పూర్తి చేయడం అధ్బుతం. దేశంలో మౌలిక సదుపాయాలు, రహదారి ప్రణాళికలు బాగున్నాయంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ విషయం పైనే రష్మిక మీద కొంత మంది విమర్శలు చేస్తున్నారు. పైగా ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేసారు. మరో కంగనా రనౌత్ లాగా మారాలనుకుంటున్నావా, ఒక వంతెనని చూపించి భారతదేశం ముందుకు వెళ్తుందని చెప్పడం అవివేకం. సాధారణ భారతీయుడు తన రోజు వారి జీవితాన్ని ఎలా గడుపుతున్నాడో తెలుసుకోవాలంటే లోకల్ ట్రైన్ లో ప్రయాణం చెయ్యి. తను చెప్తున్న మౌలిక సదుపాయల గురించి తెలుసుకోవాలంటే రష్మిక కారు దిగాలి. రష్మిక ఇన్ డైరెక్ట్ గా బిజెపి కి సపోర్ట్ చేస్తుంది. రాజకీయాల్లోకి వస్తుందేమో.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది నుంచి సపోర్ట్ గా కూడా కామెంట్స్ వస్తున్నాయి.
అటల్ సేతు ఇరవై రెండు కిలో మీటర్ల పొడవుతో 18000 కోట్లతో నిర్మాణం అయ్యింది. సౌత్ ముంబై నుంచి నావి ముంబై కి వెళ్లాలంటే మినిమమ్ రెండు గంటల సమయం పడుతుంది.అలాంటిది ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కేవలం 20 నిమిషాల్లో ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళవచ్చు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi) జనవరిలో ప్రారంబించాడు. ఇక రష్మిక ఇటీవల యానిమల్ తో భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప 2 , గర్ల్ ఫ్రెండ్,కుబేర లు షూటింగ్ దశలో ఉన్నాయి
Also Read