భార్య బాధ తెలుసంటున్న రష్మిక..యానిమల్ లో ఏం చేసానో తెలియదు
on Jan 19, 2024

గత నెల డిసెంబర్ 1 న వచ్చిన యానిమల్ మూవీ సాధించిన విజయం ఇంకా అందరి ముందు మెదులుతూనే ఉంది. గీతాంజలి క్యారక్టర్ లో రష్మిక సూపర్ గా నటించి యానిమల్ ఘన విజయంలో తన వంతు పాత్రని పోషించింది. అలాగే తన సినీ కెరీర్ లో మునుపెన్నడు లేని విధంగా రణబీర్ తో లిప్ లాప్ సీన్స్ లో నటించి సంచలనం కూడా సృష్టించింది. తాజాగా ఆ మూవీ కి చెందిన ఒక సీక్రెట్ ని ఆమె బయటపెట్టింది.
యానిమల్ లోని ఒక సన్నివేశంలో రణబీర్ తన భార్య అయిన రష్మిక (గీతాంజలి ) దగ్గరకి వచ్చి వేరే లేడీ తో (త్రిప్తి దిమ్రి) తో శృంగారం లో పాల్గొన్నానని చెప్తాడు.దాంతో రష్మిక ఆవేశంతో రణబీర్ చెంప మీద కొడుతుంది. ఆ తర్వాత అదే విషయాన్ని తలుచుకుంటు ఏడవడమే కాకుండా విపరీతమైన కోపంతో పెద్ద పెద్దగా అరుస్తుంది. థియేటర్స్ లో ఈ సీన్ విపరీతంగా పండటంతో పాటు ఆడియన్స్ ని కూడా రష్మిక పెర్ ఫార్మెన్స్ మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు ఈ ఈ సీన్ గురించే ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రష్మిక మాట్లాడింది.

ఆ సీన్ చేస్తున్నాడు తనకేమి అర్ధం కాలేదని ఒక భార్యకి తన భర్త నుంచి అలాంటి పరిస్థితి ఎదురయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అలా రియాక్ట్ అవ్వాలని డైరెక్టర్ చెప్పగానే చేసానని ఆ టైం లో నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియలేదని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆ సీన్ చూసుకున్నప్పుడు నేనేనా ఇలా యాక్ట్ చేసిందనే ఆశ్చర్యం కూడా వేసిందని ఆమె చెప్పింది. పైగా రష్మిక సింగల్ టేక్ లోనే ఆ సీన్ చెయ్యడం గమనార్హం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



