యానిమల్ సినిమా రిలీజ్ ఉన్న ఈ టైంలో ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన రణబీర్
on Nov 24, 2023

రణబీర్ కపూర్ నుంచి తాజాగా వస్తున్న చిత్రం యానిమల్.డిసెంబర్ 1 న విడుదల అవుతున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ మూవీ ప్రమోషన్స్ కూడా ఒక లెవెల్లో స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా తాజాగా బాలకృష్ణ వన్ మాన్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె ప్రోగ్రాం కి రణబీర్ ,రష్మిక లతో పాటు చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వచ్చారు.ఆద్యంతం ఎంతో హుషారుగా సాగిన షో లో రణబీర్ ప్రభాస్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ అఫ్ ది తెలుగు ఇండస్ట్రీ అయ్యాయి.
రణబీర్ ని ఈ షో లో బాలకృష్ణ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నల్లో భాగంగా తెలుగులో ఏ హీరో అంటే ఇష్టం అని అడిగాడు. అప్పుడు రణబీర్ వెంటనే నాకు ప్రభాస్ అన్న అంటే ఇష్టం. అలాగే ప్రభాస్ అన్న సినిమాలో చిన్న వేషం వచ్చినా చేస్తాను అని అన్నాడు. అలాగే ఆ సినిమాకి సందీప్ డైరెక్షన్ చేస్తే ఇంకా సంతోషం అని కూడా రణబీర్ కూడా చెప్పాడు. రణబీర్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రభాస్ ఫాన్స్ అయితే ఇది మా ప్రభాస్ రేంజ్ అని అనుకుంటున్నారు.
యానిమల్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల డిసెంబర్ 1 న విడుదుల కాబోతుంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. రణబీర్ నట విన్యాసాన్ని సందీప్ రెడ్డి మేకింగ్ ని చూడటం కోసం ప్రతి ఒక్క సినీ అభిమాని వెయిట్ చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



