నిర్మాతగా రానా దగ్గుపాటి సినిమా!!
on Jul 6, 2019
`బాహుబలి` చిత్రంతో వరల్డ్ వైడ్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు రానా దగ్గుపాటి. ప్రజంట్ తెలుగు, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉన్నాడు రానా. అయితే ఒకవైపు హీరోగా సినిమలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా సినిమాలు నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నాడట రానా. అందులో భాగంగానే మొదటి సినిమాగా యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. లవర్స్ సినిమాకు డైరక్షన్ చేసిన అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం అందుతోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో బాలీవుడ్ లో తెరకెక్కిన `డ్రీమ్ గర్ల్ ` సినిమాకు తెలుగు రీమేక్ గా సినిమా చేస్తున్నాడట రానా. ఇప్పటికే తెలుగు రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడట రానా. త్వరలో దీనిపై అధికారికంగా ఓ న్యూస్ వచ్చే అవకాశాలున్నాయి. ఇక రానా హిందీలో హాథీ మేరీ సాథీ, హౌస్ ఫుల్ 4, తెలుగులో విరాట పర్వం, గుణశేఖర్ తో హిరణ్య కశప చిత్రాలు చేస్తున్నాడు.