మిస్ యూ అంటున్న రానా... ఎవరిని ఉద్దేశించి?
on Oct 3, 2022
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో ఫ్రెండ్‌షిప్ చేయడంలో ఏముంది? పొరుగువారిని పలకరించి, వారితో పరిచయాలు పెంచుకోవడంలోనే కిక్కుంటుంది. ఈ విషయంలో ఎప్పుడూ ముందే ఉంటారు హీరో రానా దగ్గుబాటి. అదర్ ఇండస్ట్రీస్‌తో బెస్ట్ రిలేషన్స్ ఉన్న హీరో రానా దగ్గుబాటి.
లేటెస్ట్‌గా ఆయన పెట్టిన పోస్టు కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. దివంగత కన్నడ నటుడు పునీత్‌రాజ్‌కుమార్ నవ్వుతున్నట్టున్న బంగారు రంగు విగ్రహం ఇవాళ రానా ఆఫీస్‌కి చేరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రానా దగ్గుబాటి.
"ఇవాళ మీరు చూస్తున్న అత్యుత్తమ విషయం ఏంటో తెలుసా? బంగారు రంగులో నవ్వుతున్నట్టున్న పునీత్ రాజ్‌కుమార్ విగ్రహం నా ఆఫీస్‌కి రావడం. మిస్ యూ మై ఫ్రెండ్" అంటూ రానా చేసిన పోస్టు కన్నడ వర్గాల్లో వైరల్ అవుతోంది.
46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్. ఆయన మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోంది కన్నడ పరిశ్రమ. ఈ క్రమంలో రానా ఆయన్ని గుర్తు చేయడం పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు రాజ్‌కుమార్ ఫ్యామిలీ మెంబర్స్.
రానా ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి రానా నాయుడులో నటిస్తున్నారు. ఆయన హీరోగా హిరణ్యకశ్యప కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
