ఆయనకు ఆ ఒక్క కోరిక తీరలేదు..!!
on Feb 19, 2015
.jpg)
అన్నీ భారతీయ భాషల్లోనూ సినిమాలు నిర్మించిన ఘనత, 140 వరకు సినిమాలు నిర్మించి గిన్నీస్ బుక్ చోటు, 21 మంది దర్శకులు, ఆరుగురు హీరోలు, 12 మంది హీరోయిన్లు, ఏడుగురు సంగీత దర్శకులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత, గౌరవ డాక్టరేట్, దాదా సాహేబ్ పాల్కే, పద్మ విభూషణ్‌లతో పాటు అభిమానులు ఇచ్చిన మూవీ మొఘల్ బిరుదు.. ఇలా సినిమా ఇండస్ట్రీలో రామానాయుడుకు దక్కని గౌరవం లేదు. అయితే ఆయనకు చివరి వరకు ఓ కోరిక మాత్రం కోరికగానే మిగిలిపోయింది. అదేంటంటే దర్శకత్వం చేయాలనేదే. ఈ విషయాన్ని డి.రామానాయుడే చాలా సార్లు స్వయంగా చెప్పారు. వాస్తవానికి నిర్మాణంతో పాటు, దర్శకత్వం, ఎడిటంగ్, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫి ఇలా సినిమాలోని 24 శాఖల్లోనూ డి.రామానాయుడికి మంచి ప్రవేశం ఉంది. అయితే అధికారికంగా ఓ సినిమాకు దర్శకత్వం వహించిన డైరక్టర్ డి.రామానాయుడు అనే పేరు వేయించుకోవాలనేది డి.రామానాయుడి చిరకాల కోరిక. ఈ విషయాన్ని బయటపెడుతూనే.. అయితే ప్రొఫెషన్ దర్శకులు చాలా బాగా సినిమాలు తెరకెక్కిస్తున్నారని, వారిని చూసినప్పుడు మాత్రం దర్శకత్వం చేపట్టాలనే ఆలోచనలో కాస్త వెనకడుగు వేస్తున్నానని చెప్పేవారాయన. అయితే ఎప్పటికైనా మెగాఫోన్ పట్టుకోవాలని నే కోరికి మదినిండా బలంగా ఉన్నా.. చివరకు ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు మూవీ మొఘల్ డి.రామానాయుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



