చరణ్ సినిమాలో చిరుకి రోల్ లేదు
on Jul 28, 2015
దాదాపు ఎనిమిదేళ్ల కిందదట ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాతో సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత కొడుకు రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ సినిమాలో ఓ ఐదు నిమిషాలు ఇలా మెరిసి అలా మాయమయ్యారు . ఇప్పుడు మళ్లీ హీరోగా పునరాగమనం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. దాని కంటే ముందు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చరణ్ సినిమాలో తళుక్కుమనబోతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆ వార్తల్లన్ని రూమర్లని తేలిపోయింది.
ఇక ఈ విషయంపై కోన మాట్లాడుతూ.. ''రామ్ చరణ్ సినిమా గురించి ఏదిపడితే అది రాస్తుంటారు.. మీరు నమ్మకండి. ఈ మధ్యన రూమర్లు కూడా హ్యూమరస్ గా తయారయ్యాయ్'' అంటూ ఆయన పంచ్ వేశాడు. ఇక కొంతమంది సన్నిహిత వర్గాలు ఇదే విషయాన్ని అడిగితే.. అసలు చెర్రీ సినిమాల్లో చిరంజీవి రోల్ అనే ఐడియానే ఎవ్వరికీ రాలేదట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
