చరణ్ ఫైటర్ ఫస్ట్ లుక్ టీజర్
on Aug 25, 2015
రామ్ చరణ్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం చివరి దశలో షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ మరియు హీరోలకి డూప్ గా కనిపించే పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన టిసర్ అందర్ని ఆకట్టుకుంటుంది. ఆ టీజర్ లో రామ్ చరణ్ చేసిన స్టంట్స్, చరణ్ మాస్ అప్పియరెన్స్ సినీ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు బాగా నచ్చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రానికి టైటిల్ ఫైనలైజ్ చేయని చిత్ర యూనిట్ , తాజాగా ఓ టైటిల్ కి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది..మాకు అందిన సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘ది ఫైటర్’ అనే ట్యాగ్ లైన్ పెట్టాలని అనుకుంటున్నారట. దీంతో ఫ్యాన్స్ ఈ టైటిల్ తో అప్పుడే ఫస్ట్ లుక్ టీజర్ లు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ చూడండి ఓ ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ టీజర్ ..ఎలా వుందో చూసి మీరే చెప్పండీ.