చరణ్‌కి ఆ మోజు ఇంకా తీరలేదు
on Nov 4, 2014
మాస్ హీరోలెవ్వరికైనా పోలీస్ పాత్రలో ఒక్కసారైనా కనిపించాలని ఉంటుంది. చేతిలో లాఠీ పట్టుకొంటే... వచ్చే ఠీవీనే వేరు. అందుకే ఒక్కసారి యూనిఫామ్‌లో దూరిపోవాలని, చట్టానికి న్యాయానికి ధర్మానికి అంటూ సాయికుమార్ రేంజు డైలాగులు వేసేసుకోవాలని కలలు కంటారు. రామ్‌చరణ్‌కీ ఆ కోరిక కలిగింది. ఫలితం.. తుఫాన్. హిందీలో, తెలుగులో రెండు చోట్లా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. పోలీస్ పాత్ర వేశాడన్న పేరు గానీ, ఆ లుక్ మాత్రం చరణ్‌లో కనిపించలేదు. పోలీస్ పాత్రలు మనోడికి నప్పవేమో... అని ఫ్యాన్స్ కూడా తెగ ఫీలైపోయారు. తుఫాన్ దెబ్బతో పోలీస్ పాత్రలపై మమకారం పోయిందనుకొంటే పొరపాటే. ఆ మోజు చరణ్‌కి ఇంకా ఉంది. ఈసారి స్టైలీష్ పోలీస్‌గా కనిపించాలని తహతహలాడుతున్నాడు. అందుకే గౌతమ్ మీనన్‌తో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఆయనే ఎందుకంటే, పోలీస్ పాత్రల్ని తెరపై ఆవిష్కరించడంలో ఆయనది ప్రత్యేక శైలి. అందుకే తెలుగులో కథలు వినిపించడానికి ఎంత మంది దర్శకులు క్యూ కడుతున్నా, వాళ్లందరినీ పట్టించుకోకుండా గౌతమ్ మీనన్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఆయన కూడా ఇటీవలే చరణ్‌తో భేటీ వేసి, ఓ పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీ వినిపించార్ట. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే గౌతమ్ మీనన్ ప్రస్తుతం తమిళంలో అజిత్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అది పూర్తయ్యాకే చరణ్ సినిమా పట్టాలెక్కుతుంది. ఈసారైనా చరణ్ పోలీస్ డ్రస్సులో మెప్పిస్తాడంటారా?
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)