వీరప్పన్ ని పట్టుకొన్న వర్మ
on Apr 10, 2015
రాంగోపాల్ వర్మ మూడ్ ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో చెప్పలేం. కాసేపు దెయ్యాల కథలు అంటాడు. కాసేపు మాఫియా స్టోరీ అంటాడు. ఇప్పుడు ప్రేమకథ అంటున్నాడు. ఇవన్నీ అయిపోయాయి.. ఇప్పుడు వీరప్పన్ వెనుక పడ్డాడు. వీరప్పన్ కథతో ఇప్పుడు వర్మ ఓ సినిమా చేయబోతున్నాడట. అయితే నిజానికి ఇది వీరప్పన్ కథ కాదు. వీరప్పన్ని చంపిన పోలీస్ కథ.. అందుకే ఈ సినిమాకి కిల్లింగ్ వీరప్పన్ అనే టైటిల్ పెట్టాడు. ఈ ప్రపంచంలో అతిపెద్ద విలన్ వీరప్పన్ అయితే.. అతన్ని చంపిన పోలీస్ అతి పెద్ద హీరో అవుతాడంటున్నాడు వర్మ. వీరప్పన్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే వాటిలో ఎవ్వరూ చెప్పని, ఇంత వరకూ టచ్ చేయని విషయాల్ని ఈ సినిమాలో చూపిస్తానంటున్నాడు వర్మ. వీరప్పన్ని వేటాడిన వ్యక్తిగా కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటిస్తాడట. కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ ని కిడ్నాప్ చేసి వీరప్పన్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్‌ని దృష్టిలో ఉంచుకొని పునీత్‌ని రంగంలోకి దించాడన్నమాట. అయితే ఈ సినిమా తెలుగులో వస్తుందా, లేదంటే కన్నడకే పరిమితం చేస్తాడా? అనేది చూడాలి. మొత్తానికి పెద్ద స్కెచ్చే వేశాడు వర్మ.