రామ్ గోపాల్ వర్మ హీరోగా షో మ్యాన్.. ఫస్ట్ లుక్ అదిరింది!
on Dec 5, 2025

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం "షో మ్యాన్". "మ్యాడ్ మాన్స్టర్" అన్నది ట్యాగ్ లైన్. ప్రముఖ నటుడు సుమన్ ఇందులో విలన్ గా నటిస్తుండడం విశేషం. సుమన్ విలన్ గా నటించిన రజినీకాంత్ చిత్రం "శివాజీ" ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. "నూతన్" అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నాడు. ఆర్జీవీతో ఇంతకుముందు "ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2" చిత్రాలు నిర్మించి, ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి భీమవరం టాకీస్ పతాకంపై ప్రొడక్షన్ 120గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు.
రామ్ గోపాల్ వర్మ హీరోగా, సుమన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. వర్మ లుక్ ఎలా ఉంటుందో తెలిపేలా కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్స్ లో గ్యాంగ్ స్టర్ గా ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



