వర్మ ' బులెట్స్ అండ్ బూబ్స్ '
on Jan 25, 2016
.jpg)
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అన్న విషయం తెలియని వారుండరు.ఆయన సినమాలే కాక,పుస్తకాలు కూడా ప్రజల్లో చర్చలకు దారితీస్తుంటాయి..సినిమాలేని సమయంలో,జనాలు తనను మర్చిపోకుండా,ఏదో ఒక కాంట్రవర్సీతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ,లేటెస్ట్ గా మరో సెన్సేషన్ కు తెరలేపారు..మొన్నీమధ్య, గన్స్ అండ్ థైస్ బుక్ పేరుతో,శ్రీదేవి జఘనాల గురించి కామెంట్ చేసి,బోనీ కపూర్ కు బీపీ రప్పించిన వర్మ, ఇప్పడు బుల్లెట్స్ అండ్ బూబ్స్ పేరుతో మరో పుస్తకాన్ని తీసుకురాబోతున్నారట..
ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను తను కలిసినప్పటి అనుభవాలు, ఆ మీటింగ్ లో చర్చించుకున్న ఇంపార్టెంట్ విషయాల్ని ఈ బుక్ లో వర్మ చెప్పబోతున్నారట.." ఇతర గ్యాంగ్ స్టర్లతో పోలిస్తే, దావూద్ లో నేను ఇష్టపడేది అతని మిసీరియస్ వ్యక్తిత్వమే.. గత 20 ఏళ్లుగా, తనకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటికి రానంత పటిష్టంగా ఉండే రహస్య జీవితమే దావూద్ ప్రత్యేకత " అని ట్వీట్ చేశారు వర్మ.బుక్ లోని కంటెంట్ గురించే కాక,దాని పేరు గురించి ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతోంది.ఏమైనా,కాంట్రవర్సీలు క్రియేట్ చేయడంలో వర్మ స్టైలే డిఫరెంట్..

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



