ENGLISH | TELUGU  

చిరంజీవి ప్లేస్ లో రామ్ చరణ్!

on Jan 26, 2022

'మహానటి' సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌ గా కనిపించనుంది. 

తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిన ఈ మూవీ జ‌న‌వ‌రి 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ కానుంది. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను మూవీ టీమ్ గ్రాండ్ గా నిర్వహించనుంది. ఈ సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో జరగనున్న ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే తాజాగా చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆయన స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ తాజాగా అధికారికంగా తెలుపుతూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది.

ప్ర‌ముఖ నిర్మాత  దిల్‌రాజు  సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్న ఈ సినిమాకి నగేష్ కుకునూర్ ద‌ర్శ‌కుడు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ సోమవారం విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.