బాబాయ్ మాటలు మనసుని తాకాయి!!
on Dec 19, 2018
బాబాయ్ పవన్ కళ్యాణ్ పట్ల ఎప్పుడూ వినయ విధేయతలతో ఉంటాడు అబ్బాయ్ రామ్ చరణ్. ఏదైనా సినిమా ఫంక్షన్ లలో బాబాయ్ గురించి ప్రస్తావించి మెగా అభిమానులను ఉత్తేజపరుస్తుంటాడు. అలా మంగళవారం హైదరాబాద్ లో జరిగిన వరుణ్ తేజ్ నటించిన ` అంతరిక్షం` ప్రీ రిలీజ్ ఫంక్షణ్ లో రామ్ చరణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ...`` ఎన్నో ఫంక్షన్స్ కు వెళ్తుంటాం. ఎన్నో స్చీచ్ లు వింటుంటాం. మనకు ఇష్టమైన యాక్టర్స్ గానీ, వ్యక్తులు గానీ చెప్పే విషయాలు వింటున్నప్పుడు గుండెల నిండా అరవాలని పిస్తుంది. అభిమానులు ఆ అవకాశం ఉంటుంది. మాకు అరవాలని ఉన్నా కానీ అరవలేం. ఇటీవల బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ నా మనసులోకి దూసుకుపోయింది. ``రోజూ మనం భయపడే పని, భయంతో ఆపేయాలనిపించే ఓ పనిని పూర్తి చేసి సక్సెస్ సాధించాలని చెప్పారు. అది నిజంగా నాకు చాలా ఇన్ స్పిరేషన్ గా అనిపించింది. యూత్ అంతా ఇలాంటి మాటలు ఎవరు చెప్పినా ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఇంకా సినిమా గురించి చెబుతూ`` అంతరిక్షం` ట్రైలర్ చూసాను. అద్భుంగా ఉంది. ఏడాదికి ఒక సినిమా చేస్తే గొప్పనుకుంటున్న ఈ తరుణంలో వరుణ్ రెండు సినిమాలు చేస్తూ ఆశ్చర్య పరస్తున్నాడు. రెండేసి సినిమాలు చేసి అభిమానుల ముందుకు రావాలని నాకూ ఉంటుంది. ఇంత మంచి ట్రైలర్ ఇటీవల కాలంలో చూడలేదు. రాజమౌళి, సుకుమార్, క్రిష్ వంటి గొప్ప దర్శకుల జాబితాలోకి సంకల్ప్ కూడా రావాలి. ఇక వరుణ్ ఎప్పుడూ నన్ను షాక్ కి గురి చేస్తుంటాడు. కొన్ని సార్లు వరుణ్ విషయంలో ఆనందపడ్డాను. కొన్ని సార్లు అసూయపడ్డాను. అంత సెలక్టివ్ గా, అంత మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు`` అన్నారు.