'ఆర్ఆర్ఆర్' రాకపోయినా మాకేం బాధలేదు!
on Jan 13, 2022

కరోనా మళ్ళీ విరజంభిస్తుండటంతో జనవరి 7 న విడుదల కావాల్సిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ వాయిదా పడటంతో ప్రేక్షకుల్లో తీవ్ర నిరాశ చెందారు. అయితే 'ఆర్ఆర్ఆర్' ఈ సంక్రాంతికి విడుదల కాకపోవడం పట్ల తమకేం బాధలేదని రామ్ చరణ్ అన్నాడు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'రౌడీ బాయ్స్'. జనవరి 14 న విడుదల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం జరగగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మూవీ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పిన చరణ్.. ఆర్ఆర్ఆర్ వాయిదా పడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"ఈ సంక్రాంతికి మా సినిమా రాకపోయినా మాకేం బాధలేదు. ఎందుకంటే సినిమా సరైన సమయంలో రావాలి. మూడున్నర సంవత్సరాలు సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఎప్పుడు రిలీజ్ చేస్తే కరెక్ట్ అనేది దానయ్య గారు, రాజమౌళి గారు నిర్ణయిస్తారు. మాకు సంక్రాంతి ఎంతో ముఖ్యమో తెలీదు గానీ, సంక్రాంతి పండగకి దిల్ రాజు గారు చాలా ముఖ్యం. సంక్రాంతి మమ్మల్ని వదులుకోవడానికి రెడీ ఉంది గానీ దిల్ రాజుని మాత్రం వదులుకోదు. ఎన్నో సంక్రాంతి విజయాలు అందుకున్న ఆయన ఈ సంక్రాంతికి మరో విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ.. మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్" అంటూ చరణ్ స్పీచ్ ముగించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



