చరణ్‌కి చుక్కలు చూపిస్తున్న సమంత
on May 24, 2017
యంగ్ హీరో నాగ చైతన్య, సౌత్ టాప్ యాక్ట్రెస్ సమంత ఈ సంవత్సరం పెళ్లి చేసుకొని ఒక్కటవుతున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సమంత, తెలుగు, తమిళ్ లో కొన్ని సినిమాలు చేయడానికి ఒప్పుకుంది. అప్పట్లో సమంత ఇంక సినిమాలు చేయదు అని వచ్చిన రూమర్స్ ని కొట్టి పారేస్తూ... చైతు నుండి కానీ అక్కినేని ఫామిలీ నుండి కానీ తాను ఆక్ట్ చేయడం విషయంలో వ్యతిరేకత లేదని, సో సినిమాల్లో కంటిన్యూ అవుతానని వివరించింది. తాజా సమాచారం ప్రకారం, చైతు-సామ్ ల పెళ్లి అక్టోబర్ మొదటి వారంలో జరగనుంది.
అయితే, పెళ్ళికి కనీసం 40 - 50 రోజులు టైం తీసుకొని అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకోవాలనుకుంటోందట సామ్. అందుకే, తన సినిమా దర్శక, నిర్మాతలకి వీలయినంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాల్సిందిగా అడుగుతుందట. తన సినిమాల్ని కొంచెం నిదానంగా పూర్తి చేసుకునే రామ్ చరణ్ కి ఇది తల నొప్పి తెచ్చే వ్యవహారంగా మారిందని అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో చరణ్-సామ్ హీరో, హీరోయిన్ గా చేస్తున్న విషయం మనందరికీ విదితమే. ఒక వేళ ఈ సినిమా జులై ఎండ్ కి కానీ ఆగష్టు మొదటి వారానికి గాని కంప్లీట్ చేసినా, సమంత ప్రమోషన్స్ లో పాల్గొంటుందా అని డౌట్. సో, ఈ రకంగా సమంత పెళ్లి చరణ్ కి ఇబ్బందులు కొని తీసుకొస్తుంది.