రకుల్ పెళ్లెప్పుడో లీక్ చేసిన ఆమె బ్రదర్
on Oct 13, 2022

రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటుడు-నిర్మాత జాకీ భగ్నానీ తమ అనుబంధాన్ని మరో లెవల్‌కు తీసుకుపోనున్నారు. ప్రేమలో నిండా మునిగితేలుతున్న ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇద్దరూ వచ్చే ఏడాది భార్యాభర్తలుగా మారనున్నారు. ఇద్దరికీ పెళ్లిపై అపారమైన నమ్మకం ఉంది అని సన్నిహితులు తెలిపారు. ఏ నెలలో, ఏ తేదీన ఆ ఇద్దరూ దంపతులు కానున్నారనే విషయం బయటకు రాకపోయినా, ఇద్దరి కుటుంబాల పెద్దలు పెళ్లి గురించి సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ పెళ్లిని వైభవంగా చెయ్యాలని జాకీ తండ్రి వషు భగ్నానీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ విషయమై రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ మాట్లాడుతూ, జాకీ భగ్నానీ ద్వారా రకుల్ రెండు సినిమాల్లో నటించింది. పెళ్లి అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు రకుల్ స్వయంగా ఆ విషయం అనౌన్స్ చేస్తుంది. ఏ అనుబంధానికైనా పెళ్లి అనేది క్లైమాక్స్. ఇండియన్ సినిమాలోని టాప్ ప్రొడ్యూసర్స్‌లో జాకీ ఒకడు. అతని మైండ్‌లో చాలా ప్రాజెక్టులున్నాయి. నిజానికి ఇద్దరూ బిజీగా ఉండే వ్యక్తులు. వాళ్లకు సొంత గోల్స్ అనేవి ఉన్నాయి అని చెప్పాడు.
కాబట్టి, ఎప్పుడైనా సోషల్ మీడియా ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ తమ పెళ్లిని ప్రకటించే అవకాశం ఉంది. 32 సంవత్సరాల రకుల్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. వాటిలో హిందీవే ఎక్కువ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



