అందులో రకుల్‌ది వేశ్య పాత్ర
on Nov 4, 2019
‘వేదం’ చిత్రంలో అనుష్క వేశ్య పాత్రలో తన నటనతో ప్రేక్షకులందర్నీ మెప్పించారు. ఆమెకు ముందు చాలామంది కథానాయికలు వెండితెరపై వేశ్యలుగా నటించారు. అయితే, ఈతరం కథానాయికల్లో వేశ్య పాత్రలు చేసినవారి సంఖ్య అతి తక్కువమంది. అందులో రకుల్ ప్రీత్‌సింగ్ ఒకరు. ‘దే దే ప్యార్ దే’ తర్వాత రకుల్ నటించిన హిందీ సినిమా ‘మర్ జవాన్’. సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. అతడితో ఇంతకు ముందు రకుల్ నటించిన ‘అయ్యారీ’ ఫ్లాప్. కానీ, ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ మూడు అడుగుల మరగుజ్జుగా విలన్ పాత్ర పోషించారు. తారా సుతారియా హీరోయిన్. ‘మర్ జవాన్’లో తనది వేశ్య (సెక్స్ వర్కర్) పాత్ర అని రకుల్ తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తన పాత్ర ఎమోషనల్‌గా సాగుతుందని చెప్పారు. ‘దే దే ప్యార్ దే’ విడుదల తర్వాత బాలీవుడ్ స్టార్స్ తనకు ఫోనులు చేసి ప్రశంసించారని రకుల్ తెలిపారు. తనకు పాత్ర నిడివితో సంబంధం లేదనీ, మంచి పాత్ర అనిపిస్తే, నచ్చితే చేయడానికి సిద్ధమని ఆమె అన్నారు. ఇప్పటికే ‘మర్ జవాన్’లో రకుల్ పాట ‘హయ్యా హో’ యూట్యూబ్‌లో హిట్టయ్యింది.