ఆది - రకుల్... ఓ ఎంగిలి ముద్దు
on Nov 3, 2014
కొత్త హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాగా రెచ్చిపోతోంది. సినిమా సినిమాకీ గ్లామర్ డోస్ పెంచేస్తోంది. మొన్న కరెంటు తీగలో నాభి అందాల్ని చూపించి కుర్రకారుని ఆకట్టుకొంది. ఇప్పుడు ఏకంగా లిప్‌లాక్‌లో దిగిపోయింది. ఆదికి ఓ ఘాటైన ఎంగిలి ముద్దు ఇచ్చింది. 'రప్' సినిమా కోసం. ఆది, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం రఫ్. ఈ సినిమాలో రకుల్, ఆదిల మధ్య లిప్ లాక్ సీన్ ఉంది. ట్రైటర్లోనే ఆదే కట్ చేసి.. అందరినీ ఊరిస్తున్నారు. కొత్తమ్మాయిల్లో రెజీనా ఇప్పటికే లిప్‌లాక్‌ల విషయంలో దూసుకుపోతోంది. ఇప్పుడు రకుల్ కూడా పోటీకి వచ్చేసిందన్నమాట. రఫ్‌లో రకుల్ అందాలు, ఈ లిప్ లాక్ స్పెషలాఫ్ ఎట్రాక్షన్ అని చిత్రబృందం భావిస్తోంది. ఆది కూడా షర్టు విప్పి కండలు చూపించాడు. తన సిక్స్ ప్యాక్ బాడీతో మాస్‌ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇవన్నీ ఈ సినిమాని ఎంత వరకూ గట్టెక్కిస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
