'రాజు వెడ్స్ రాంబాయి'కి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్!
on Nov 22, 2025

ఈ ఏడాది ఈటీవీ విన్ నుండి వచ్చిన 'లిటిల్ హార్ట్స్' చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' కూడా అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేసేలా ఉంది. (Raju Weds Rambai)
'లిటిల్ హార్ట్స్' తర్వాత ఈ ఏడాది ఈటీవీ విన్ నుండి వచ్చిన చిత్రం 'రాజు వెడ్స్ రాంబాయి'. విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల ఈ సినిమాతో నిర్మాతగా మారడం విశేషం. నూతన దర్శకుడు సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వి రావు, చైతు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలు పోషించారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా రా లవ్ స్టోరీగా రూపొందిన 'రాజు వెడ్స్ రాంబాయి' నవంబర్ 21న విడుదలైంది. కొన్ని చోట్ల నవంబర్ 20 సాయంత్రం ప్రీమియర్స్ పడ్డాయి. మొదటి షో నుండి మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. సంచలన వసూళ్లతో సత్తా చాటుతోంది.
Also Read: రాజు వెడ్స్ రాంబాయి మూవీ రివ్యూ
'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా మొదటిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.1.47 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది తెలుగు స్టేట్స్ లో 'లిటిల్ హార్ట్స్' ఓపెనింగ్ డే కలెక్షన్ కంటే ఎక్కువ కావడం విశేషం.
ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల తాకిడి లేకపోవడం, అలాగే ఇతర సినిమాలకు పాజిటివ్ టాక్ రాకపోవడం 'రాజు వెడ్స్ రాంబాయి'కి కలిసొచ్చే అంశం. మరి ఫుల్ రన్ లో ఈ మూవీ ఎన్ని కోట్ల గ్రాస్ రాబడుతుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



