'పెద్దన్న'గా సూపర్ స్టార్?
on Oct 14, 2021
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ దీపావళికి `అణ్ణాత్త`గా పలకరించబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ భారీ బడ్జెట్ మూవీ సందడి చేయనుంది. `శౌర్యం` శివ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో నయనతార, కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ వంటి భారీ తారాగణం కనువిందు చేయనుంది.
ఇదిలా ఉంటే.. తెలుగులోనూ `అణ్ణాత్త` అనువాద రూపంలో అదే రోజున సందడి చేయనుంది. తెలుగు హక్కులను నారాయణదాస్ నారంగ్, సురేశ్ బాబు సొంతం చేసుకున్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాకి తెలుగులో `పెద్దన్న` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానున్నది.
అన్నాచెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ కి చెల్లెలుగా కీర్తి సురేశ్ కనిపించబోతుండగా.. అతనికి జోడీగా నయన్ అలరించనుంది. డి. ఇమాన్ సంగీతమందించిన ఈ సినిమా కోసం గానగంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం కథానాయకుడి పరిచయ గీతాన్ని ఆలపించారు. తమిళంలో ఇటీవల విడుదలైన సదరు పాటకి మంచి స్పందన లభిస్తోంది.