`బీస్ట్`, `ఖైదీ` కెప్టెన్స్ తో సూపర్ స్టార్!?
on Feb 8, 2022
గత ఏడాది దీపావళికి రిలీజైన `అణ్ణాత్త` (తెలుగులో `పెద్దన్న`)తో చివరిసారిగా వెండితెరపై సందడి చేశారు సూపర్ స్టార్ రజినీకాంత్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సిస్టర్ సెంటిమెంట్ మూవీ.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో.. రజినీకాంత్ తదుపరి చిత్రం గురించి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్!
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `డాక్టర్`, `బీస్ట్` చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ వెంచర్ ఉండబోతోందట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. అంతేకాదు.. వేసవిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కవచ్చంటున్నారు. అలాగే, `ఖైదీ` దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తోనూ రజినీకాంత్ ఓ మూవీ చేయబోతున్నారట. ప్రస్తుతం లోక నాయకుడు కమల్ హాసన్ తో లోకేశ్ చేస్తున్న `విక్రమ్` పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని అంటున్నారు. త్వరలోనే రజినీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Also Read: ఇలియానా.. బరువు పెరిగిందిలా!
ఇదిలా ఉంటే.. నెల్సన్ దిలీప్ కుమార్ తాజా చిత్రం `బీస్ట్` ఏప్రిల్ లో తెరపైకి రానుంది. ఇందులో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service




