షాక్ ఇచ్చిన రజనీకాంత్..మీడియాతో చెప్పడం కరెక్టే నా!
on Jan 7, 2025
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth)ఇటీవల 'వేట్టయ్యన్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు అదే ఉత్సాహంతో తన అప్ కమింగ్ మూవీ 'కూలి'కి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ని థాయిలాండ్ లో జరుపుకోనుంది.
ఈ నేపథ్యంలో రజనీ కాంత్ థాయిలాండ్ వెళ్ళటానికి చెన్నై ఎయిర్ పోర్ట్ వద్దకు వచ్చాడు.ఈ సందర్భంగా కొంత మంది మీడియా వాళ్ళు రజనీ తో సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్నించగా అలాంటి అసంబద్ద ప్రశ్నలు వేయద్దు.రాజకీయాల గురించి కూడా నన్ను అడగవద్దని తన అసహనాన్ని వ్యక్తం చేసాడు.చెన్నై లోని అన్నామలై యూనివర్సిటీ లో ఇటీవల 19 ఏళ్ళ అమ్మాయిపై లైంగిక దాడి జరిగిన విషయం చర్చినీయాంశమయిన నేపథ్యంలోనే సదరు విలేకరి రజనీని ఆ ప్రశ్న అడిగినట్టుగా తెలుస్తుంది.కానీ రజనీ మాత్రం ఆ వ్యవహారం గురించి మాట్లాడకుండా తన 'కూలి' సినిమా గురించి మాట్లాడి అక్కడ్నుంచి వెళ్లడం జరిగింది.
ఇక 'కూలి'(Cooliee)కి లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)దర్శకుడు కావడంతో మూవీపై రజనీ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.విజయ్ తో తెరకెక్కించిన 'లియో' తర్వాత లోకేష్ నుంచి వస్తున్న మూవీ కూడా కూలీనే.బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కింగ్ నాగార్జున(Nagarjuna)సైమన్ గా కనిపిస్తున్నాడు.ఆ క్యారక్టర్ లోని నాగార్జున లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.కొన్ని నెలల క్రితం రిలీజైన రజనీ ఇంట్రడక్షన్ టీజర్ ఒక రేంజ్ లో ఉండటమే కాకుండా రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకు పోతు ఉంది.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ వ్యయంతో కూలీని నిర్మిస్తున్నాడు.శృతి హాసన్,ఉపేంద్ర,సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు
Also Read