తలకోనలో రజనీకాంత్ ఏం చేస్తున్నాడు!
on Jul 11, 2016
.jpg)
మొన్నటివరకూ చెన్నైలో "రోబో 2.0" చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నట్టుండి తలకోనకు పయనమవ్వనున్నాడు. తిరుపతికి దగ్గర్లోని తలకోనలో ఏకంగా 270 అడుగుల జలపాతం ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో "రోబో 2.0" షూటింగ్ జరగనుంది. ప్రస్తుతం "రోబో" టీమ్ ఇక్కడే ఉంది. షూటింగ్ కు కావాల్సినవన్నీ రెడీ చేసుకొంటున్నారు. ఆగస్ట్ నుంచి రజనీకాంత్ కూడా చిత్రీకరణలో పాల్గొననున్నాడు. రజనీ సరసన అమీజాక్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. 2016 దీపావళికి "రోబో 2.0" చిత్రాన్ని విడుదల చేద్దామని నిర్మాతలు ఆలోచన!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



