రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా దర్శకేంద్రుడు?
on Dec 2, 2020
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఓ పూర్తిస్థాయి పాత్ర కోసం మేకప్ వేసుకోబోతున్నట్లు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు, మాటల రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి నిర్దేశకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. కాగా, స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తాలూకు కథకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
అదేమిటంటే.. ఓ కాలనీ నేపథ్యంలో సాగే చిత్రమిదని.. ఇందులో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా కె. రాఘవేంద్రరావు కనిపిస్తారని, ఆయన శ్రీమతిగా యాభై ఏళ్ళు పైబడిన మహిళగా రమ్యకృష్ణ దర్శనమిస్తారని సమాచారం. అలాగే మరో ముగ్గురు కథానాయికలు (శ్రియ, సమంత, ఓ నూతన తార) కూడా అతిథి పాత్రల్లో మెరుస్తారని వినికిడి.
మార్చి నుండి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా కమర్షియల్ టచ్, ఫన్ తో సాగుతుందని బజ్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు. మరి.. ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడి అభినయం ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది ద్వితీయార్ధం వరకు వేచిచూడాల్సిందే.
Also Read