వెంకయ్యనాయుడుతో రచ్చ రవి
on Jul 2, 2024
.webp)
జబర్దస్త్ కామెడీ షోతో పాపులరైన రచ్చ రవి సినిమాల్లో కూడా నటిస్తూ బిజీ అయ్యాడు. తెలంగాణ హన్ముకొండ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రచ్చ రవి ఒక్కోమెట్టు ఎక్కుతూ నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇటీవల ‘బలగం’ సినిమాలో ఆటో డ్రైవర్‌గా హీరోకి స్నేహితుడిగా కామెడీని పండించాడు. అలాంటి రచ్చ రవి ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ బాగా పోస్టులు పెడుతూ ఉంటాడు. రీసెంట్ గా పద్మ విభూషణ్ మాజీ ఉపరాష్ట్రపతిని ముప్పవరపు వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ఆయనతో దిగిన ఫోటోని కూడా పోస్ట్ చేసాడు.
రచ్చరవి చిన్నప్పటి నుంచే చార్లి చాప్లిన్ సినిమాలు చూసి కమెడియన్ అవ్వాలనుకున్నాడు. మిమిక్రీ నేర్చుకొని పలు ప్రదర్శనలు ఇచ్చాడు. తర్వాత దుబాయ్ లో రేడియో జాకీగా కొన్నాళ్లు చేసి ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. ఓ రోజు ‘జబర్దస్త్’ లో చమ్మక్ చంద్ర టీమ్ లో సభ్యుడు కోసం ఆడిషన్స్ జరగడంతో అందులో ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాడు. అలా తన కామెడీ టైమింగ్ తో రచ్చరవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



