చియాన్తో రాశీఖన్నా?
on Dec 1, 2020
బాలీవుడ్ మూవీ మెడ్రాస్ కేఫ్ తో నటనకు శ్రీకారం చుట్టిన రాశీఖన్నా.. ఆపై తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. అన్ని చోట్లా విజయాలు చూసింది. సోమవారం (నవంబర్ 30) థర్టీ ప్లస్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల రాశి.. తాజాగా మరో తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. సామి, సామి స్క్వేర్ తరువాత చియాన్ విక్రమ్, స్టార్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఇందులో నాయికగా రాశీఖన్నా ఎంపికైందని సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు.
కాగా ప్రస్తుతం రాశి చేతిలో నాలుగు కోలీవుడ్ వెంచర్స్ ఉన్నాయి. అరణ్ మణై 3, మేధావి, తుగ్లక్ దుర్బార్, సైతాన్ కా బచ్చా.. ఇలా డిఫరెంట్ జానర్ మూవీస్ లో రాశి నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్యతోనూ ఓ సినిమా చేయబోతోంది. దీనికీ హరినే దర్శకత్వం వహించనుండడం విశేషం.
మరి.. అరడజను అరవ సినిమాలతో బిజీ బీగా మారిపోయిన రాశి.. వాటితో స్టార్ హీరోయిన్ల లీగ్ లో చేరిపోతుందేమో చూడాలి.