'గేమ్ చేంజర్'గా రామ్ చరణ్!
on Mar 27, 2023

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమాని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. చరణ్-శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
నేడు(మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'RC 15' టైటిల్ ని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి 'గేమ్ చేంజర్' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. శంకర్ శైలిలో డిజైన్ చేసిన టైటిల్ లోగో ఆకట్టుకుంటోంది. నిజానికి ఈ సినిమాకి 'ఆఫీసర్', 'సర్కారోడు', 'సీఈఓ' వంటి టైటిల్స్ ని పరిశీలించినట్లు వార్తలొచ్చాయి. కానీ అనూహ్యంగా 'గేమ్ చేంజర్'ని ఫైనల్ చేశారు. పాన్ ఇండియా మూవీకి ఇది పర్ఫెక్ట్ టైటిల్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
'గేమ్ చేంజర్' ఫస్ట్ లుక్ కూడా ఈరోజే విడుదల కానుంది. మధ్యాహ్నం 3:06 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. టైటిల్ కి తగ్గట్లే ఫస్ట్ లుక్ కూడా ఏ రేంజ్ లో ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



