ENGLISH | TELUGU  

మాస్ కి అసలుసిసలు పండగ.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు!

on Nov 29, 2021

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలకానుంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ ప్రకటించారు.

ఆర్య, ఆర్య-2 సినిమాల తర్వాత బన్నీ-సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్పపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో ట్రైలర్, సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. పుష్ప ట్రైలర్ ను డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో బన్నీ లుక్ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ట్రైలర్ తో పుష్ప రాజ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప మూవీలో బన్నీ సరసన రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్‌ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.