పుష్ప మాస్ జాతర షురూ.. ఇక పూనకాలే...
on Apr 2, 2024

దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'పుష్ప- ది రూల్'(Pushpa 2: The Rule) ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప ది రైజ్' పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లో అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. ఆయనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. అందుకే దానికి కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప-2'పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
తాజాగా 'పుష్ప-2'(Pushpa 2) నుంచి వచ్చిన అప్డేట్ తో అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబరాల్లో ఉన్నారు. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్.

'పుష్ప-1'లో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ కి వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ, క్రికెట్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. దాంతో ఇప్పుడు 'పుష్ప-2'లో బన్నీ లుక్స్, మ్యానరిజమ్స్ ఎలా ఉంటాయోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న 'పుష్ప-2' చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవం కానుకగా 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



