ఈ పని ఎప్పుడో చేసుండాల్సింది కద పుష్ప
on Dec 23, 2024
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో చూడటానికి అల్లుఅర్జున్(allu arjun)హైదరాబాద్ సంధ్య థియేటర్ కి వెళ్లగా అభిమానుల మధ్య తొక్కిసలాట జరగడం, దీంతో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ హాస్పిటల్లో ఉన్నాడు. శ్రీ తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని,ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది.
రీసెంట్ గా రేవతి కుటుంబానికి పుష్ప 2(pushpa 2) ని నిర్మించిన మైత్రీ మూవీస్(mythri movies)సంస్థ 50 లక్షల రూపాయిల చెక్కుని మృతురాలి కుటుంబానికి అందివ్వడం జరిగింది.దీంతో ఈ పని ఎప్పుడో చేసుండాల్సిందని సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న విషయం తెలిసిందే.మైత్రి మూవీస్ తెలుగులో దాదాపుగా అందరి హీరోలతోను సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాణ సంస్థగా మంచి పేరు సంపాదించుకుంది.