అల్లుఅర్జున్ కోసం హైదరాబాద్ లో వాహనాల దారి మళ్లింపు
on Dec 2, 2024
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ వన్ మాన్ షో పుష్ప 2 ఈ నెల ఐదు న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.సుకుమార్ దర్సకత్వంలో తెరకెక్కుతున్నఈ మూవీలో రష్మిక హీరోయిన్ కాగా,శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ తో కనువిందు చేయనుంది.పైగా ఒక రోజు ముందుగానే అంటే నాలగవ తారీకు సాయంత్రమే వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షోస్ కూడా పడనున్నాయి.దీంతో అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రేమికుల్లో కూడా సందడి వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు ఆ సందడిని రెట్టింపు చేస్తూ చిత్ర బృందం ప్రీరిలీజ్ ఈవెంట్ జరపనుంది.
హైదరాబాద్ యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ తో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొననుంది.దీంతో ఈ ఈవెంట్ కి పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తారనే దృష్ట్యా ట్రాఫిక్ వెస్ట్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ కి సంబంధించి ఒక ఉత్తర్వుని జారీ చేయడం జరిగింది.యూసఫ్ గూడ చెక్ పోస్ట్ నుంచి పలు మార్గాలకి వెళ్లే వాహనదారులతో పాటు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్,మైతివనం నుంచి యూసఫ్ గూడ వైపు వచ్చే వాళ్ళకి ప్రత్యామ్న్యాయ మార్గాలని సూచిస్తూ ఆయా ప్రాంతాల్లో బోర్డ్స్ ని కూడా ఏర్పాటు చేసారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఆ నిబంధనలు వర్తిస్తాయి.
అదే విధంగా ఈవెంట్ కి వచ్చే అభిమానులు,మూవీ లవర్స్ తమ వెహికల్స్ ని జానకమ్మ తోట, సవేరా అండ్ మహమ్మద్ ఫంక్షన్ హాల్స్ లో పార్కింగ్ చేసుకోవాల్సిందిగా కూడా సూచనలు జారీ చేసింది.ఈ సందర్భంగా నగర ప్రజలు సహకరించాలని కూడా పోలీసులు ప్రజలని కోరారు.
Also Read