ఏందబ్బీ పుష్ప 50 కోట్లు వార్త నిజమేనా!
on Feb 28, 2024
భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ప్రేస్టీజియస్ట్ ప్రాజెక్ట్స్ గా తెరకెక్కుతున్న చిత్రాల్లో పుష్ప 2 కూడా ఒకటి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు షూటింగ్ ని పూర్తి చేసుకొని ఎప్పుడెప్పుడు తమ ముందుకు వస్తుందా అని భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి పుష్ప కి ఉన్న కెపాసిటీ ని చాటి చెప్తుంది.
సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా పుష్ప పార్ట్ 2 కి సంబంధించిన ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒక జాతర నేపథ్యంలో ఉండబోతుందనే వార్తలు వచ్చాయి. భారీ ఖర్చుతో అదంతా తెరకెక్కబోతుందని కూడా వార్తలు వచ్చాయి.25 నిమిషాల పాటు సాగే ఆ ఎపిసోడ్ కోసం 50 కోట్లు దాకా ఖర్చుపెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన మాత్రం రాలేదు. కానీ 50 కోట్లు ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం ఖర్చు చేస్తున్నారనే విషయం మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ తో పార్ట్ 1 లో జత కట్టిన రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుండగా ఫాహద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ కలల సౌధం అయిన పుష్ప 2 ని మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తుంది. అగస్ట్ 15న వరల్డ్ వైడ్ గా పుష్ప 2 థియేటర్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.
Also Read