ఈ నెల 15న "పున్నమి రాత్రి"
on Jul 13, 2016

శ్రద్ధాదాస్, మోనాల్ గుజ్జర్ (సుడిగాడు ఫేమ్) ఆర్యన్, శ్వేతాబసుప్రసాద్, నాజర్, ప్రభు, కృష్ణ భగవాన్ ముఖ్య తారాగణంగా రూపొందిన గ్లామరస్ హారర్ ఎంటర్ టైనర్ "పున్నమి రాత్రి". వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. కలర్స్ అండ్ క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఎం. సుబ్బారెడ్డి నిర్మించారు. 2 డి, మరియు 3 ఢీలో ఈ చిత్రం రూపొంది ఉండడం విశేషం. ఈ చిత్రాన్ని ఈ నెల 15న ఎం.జి.ఎం మూవీస్ ద్వారా అచ్చిబాబు విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత ఎం.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. "హారర్ ఎంటర్ టైనర్స్ ను ఇష్టపడేవారిని అమితంగా అలరించే చిత్రం "పున్నమి రాత్రి". ఈ చిత్రాన్ని ఎం.జి.ఎం మూవీస్ ద్వారా అచ్చిబాబు విడుదల చేస్తున్నారు. శ్రద్ధాదాస్, మోనాల్ గుజ్జర్, శ్వేతాబసు ప్రసాద్ ల గ్లామర్ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణ. 2 డి, మరియు 3డి లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఈ నెల 15న విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



