ENGLISH | TELUGU  

Psych Siddhartha: సైక్ సిద్దార్ధ మూవీ రివ్యూ

on Dec 31, 2025

 

 

 


 
సినిమా పేరు: సైక్ సిద్దార్ధ 
న‌టీన‌టులు: శ్రీ నందు, యామిని భాస్కర్,ప్రియాంక రెబెకా, సింహ, సుఖేష్ రెడ్డి    త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: ప్రకాష్ రెడ్డి. కె 
ఎడిట‌ర్‌: ప్రతీక్ 
సంగీతం: స్మరన్ సాయి  
నిర్మాత‌లు: రానా దగ్గుబాటి, శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి 
బ్యానర్స్: స్పిరిట్ మీడియా, నందు నెస్, సురేష్ ప్రొడక్షన్స్ 
రిలీజ్: ఏషియన్ సురేష్  ఎంటర్ టైన్ మెంట్స్  
రచన, ద‌ర్శ‌క‌త్వం: వరుణ్ రెడ్డి 
రిలీజ్ డేట్ : జనవరి 1 ,2025 

 

 

 


శ్రీ నందు(Shree Nandu)తన సెకండ్ ఇన్నింగ్స్ లో  రీసెంట్ గా దండోరా తో వచ్చి తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసాడు. ఇప్పుడు సోలో హీరోగా 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha) తో వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టాడు. రానా దగ్గుబాటి రిలీజ్ చేయడం, నందు కూడా ఒక నిర్మాతగా వ్యవహరించడం ఈ చిత్రం స్పెషాలిటీ. ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా  ఉందో చూద్దాం.

 

 

కథ


సిద్దార్ధ( నందు), త్రిష( ప్రియాంక రెబకా) ఒకరికొకరు ఇష్టపడతారు.ఇద్దరు శారీరకంగా కూడా చాలా సార్లు కలుస్తారు. కానీ త్రిష ఆ తర్వాత మన్సూర్ (సుఖేష్ రెడ్డి)  అనే బిజినెస్ మెన్ ని ఇష్టపడి పెళ్ళికి సిద్దమవుతుంది. శ్రావ్య( యామిని భాస్కర్) భరత నాట్యంలో ప్రావీణ్యురాలు. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో తన ఎనిమిదేళ్ల వయసు ఉన్న కొడుకు రిషితో కలిసి వేరేగా ఉంటు ఉంటుంది. రేవంత్(సింహ) తన భార్య దగ్గర డబ్బులు తీసుకొని సిద్దార్ధ కి అప్పుగా ఇస్తాడు. అందుకు కారణం చిన్నప్పట్నుంచి సిద్దార్ధ, రేవంత్ లు ప్రాణస్నేహితులు.  ఈ ఆరుగురు చుట్టూ అల్లుకున్న అవసరాలు, కారణాలు,  ప్రేమలు, పంతాలు, ఆప్యాయత, అమాయకత్వాల నేపధ్యమే సైక్ సిద్దార్ధ.


 

ఎనాలసిస్ 

 

ఇలాంటి కథలు సెల్యులాయిడ్ పై చాలానే వచ్చాయి. డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలే ఒక ఉదాహరణ. కాకపోతే కొత్త తరహా దర్శకత్వం, ఫొటోగ్రఫీ, నందుతో సహా మిగతా   ఆర్టిసుల నాచురల్ పెర్ ఫార్మెన్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కొత్త తరహా స్క్రీన్ ప్లే సైక్ సిద్దార్ధ ని బోర్ కొట్టకుండా చేసాయి. కొన్ని అసభ్య సన్నివేశాలు ఉన్నా చాలా చిత్రాల్లో వస్తు ఉన్నవే. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే ప్రారంభ సన్నివేశమే కొత్తగా ఉంది. దీంతో సిద్దార్ధ తో కనెక్ట్ అవుతాం.

 

 

ఆ తర్వాత రేవంత్, సిద్దార్ధ్ మధ్య వచ్చిన సన్నివేశాలు బాగున్నా, నవ్వుని మాత్రం పెద్దగా తెప్పించలేకపోయాయి.అసలు మూవీ మొత్తం  ఎంటర్ టైన్ మెంట్ ని బాగా సృష్టించవచ్చు. ఆ స్కోప్ గా కూడా ఉంది. కాకపోతే మేకర్స్ ఆ దిశగా దృష్టి పెట్టలేదు.కొన్ని క్యారెక్టర్స్ పైన మాత్రమే మూవీ మొత్తాన్ని నడిపించారు.  త్రిష, సిద్దార్ధ మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు అయితే పీక్ లో ఉండటంతో పాటు, మోడరన్ తిరుగుళ్ళకి అలవాటు పడ్డ  కొంత మంది అమ్మాయిలు డబ్బు, హోదాకి, శారీరక సుఖానికి తప్ప స్వచ్ఛమైన ప్రేమకి విలువ ఇవ్వరని చెప్పినట్లయింది.

 

 

శ్రావ్య క్యారక్టర్ ద్వారా మాత్రం ఆడవాళ్ళ ఆత్మభిమానాన్ని, కసాయి భర్త పెట్టే ఇబ్బందుల నుంచి తప్పించుకొని, తమ మనసు ఒక మంచి వ్యకి కోసం ఎలా ఎదురుచూస్తుందో చెప్పినట్లయింది. సిద్దార్ధ,మన్సూర్ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి.ఇంటర్ వెల్ సన్నివేశం పెద్దగా పేలింది ఏమి లేదు. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో    ముందుగానే ఊహిస్తాం. కాకపోతే ప్రారంభంలోనే చెప్పుకున్నట్టుగా డిఫెరెంట్ స్క్రీన్ ప్లే తో పాటు క్యారక్టర్ డిజైన్స్  బాగుండటంతో చూస్తూ ఉండిపోతాం. సిద్దార్ధ, శ్రావ్య, రిషి మధ్య వచ్చే సీన్స్ అయితే  చాలా బాగున్నాయి. స్వచ్ఛమైన ప్రేమకి, శీలానికి సంబంధం ఉండదని చెప్పినట్లయింది. ఇలాంటి ప్రేమలు బయట సొసైటీ లో చాలానే జరుగుతున్నాయి. దాంతో నిజమైన క్యారెక్టర్స్ ని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది.

 

 

స్కూల్ సన్నివేశాలు మాత్రం  ఈ కథకి అవసరం లేదు. సిద్దార్ధ్ చేసే పెయింటింగ్ పని కి సంబంధించి కాంట్రాక్టు రావడం కోసం స్కూల్ సన్నివేశాలు ఎస్టాబ్లిష్ చేసి ఉండవచ్చు. కానీ సిద్దార్ధ పెయింట్ కాంట్రాక్టు, మన్సూర్ ఆఫీస్ కి సంబంధించినది అయ్యి ఉంటే  కావాల్సినంత ఫన్ వచ్చేది. ఎందుకంటే  మన్సూర్ తో ఉండి కూడా త్రిష నిన్ను మర్చిపోలేకపోతున్నానని సిద్దార్ధ ని  కలవడానికి వస్తుంది.కాబట్టి  సిద్దార్ధ పెయింటింగ్ కాంట్రాక్టు మన్సూర్ ఆఫీస్ కి షిఫ్ట్ చేసి ఉండాల్సింది. ఇక్కడే కావాల్సినంత ఫన్ ని జనరేట్ చేసుకొనే అవకాశం ఉండేది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం బాగున్నాయి.   

  


నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు 

 

 

సిద్దార్ధ గా నందు పెర్ ఫార్మెన్స్ ఒక రేంజ్ లో సాగింది. అన్ని వేరియేషన్స్ లోను ఎవరు ఎలాంటి  వంక పెట్టని విధంగా  అద్భుతంగా చేసి మరో సారి సిల్వర్ స్క్రీన్ పై బెస్ట్ పెర్ఫార్మ్ ని ప్రదర్శించాడు. ఈ మూవీ తర్వాత నందు సినీ డైరీ బిజీ అవుతుందేమో చూడాలి. ఇక  శ్రావ్య క్యారక్టర్ లో యామిని భాస్కర్(Yamini Bhaskar)కూడా సూపర్ గా చేసింది. అసలు ఆ క్యారక్టర్ తన కోసమే పుట్టిందా అనేలా మెస్మరైజ్ చేసింది. త్రిష గా చేసిన ప్రియాంక(Priyanka Rebekah)కూడా అంతే మేకర్స్ తన క్యారక్టర్ ని ఏ పర్పస్ కోసం అయితే సృష్టించారో, ఆ ప్రకారం తన వంతు న్యాయం చేసింది. సిద్దార్ధ ఫ్రెండ్ గా చేసిన సింహ, త్రిష మరో లవర్ గా చేసినా సుఖేందర్ రెడ్డి కూడా అద్భుతమైన పెర్ఫార్మ్ ఇచ్చారు.ఇక దర్శక రచయిత వరుణ్ రెడ్డి(Varun Reddy)గురించి చెప్పుకోవాలంటే ఒక మాములు కథని తన అద్భుతమైన డైరెక్షన్ తో  కట్టిపడేసాడు. ఒక కొత్త రకమైన టేకింగ్ ని కూడా చిత్ర సీమకి పరిచయం చేసినట్లయింది. రచయితగా మాత్రం పెద్దగా మెప్పించలేకపోయాడు. నిర్మాణ విలువలు కథకి తగ్గ విధంగా  బాగున్నాయి. సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ అయితే ఒక లెవల్. ఆ రెండు ఈ చిత్రానికి మరో ప్రాణంగా నిలిచాయి.

 

 

 

ఫైనల్ గా చెప్పాలంటే ఇలాంటి చిత్రాలు సెల్యులాయిడ్ పై గతంలో చాలా వచ్చినా కూడా కథ నడిచిన విధానం, దర్శకత్వం, మ్యూజిక్, ఫొటోగ్రఫీ, నందుతో పాటు మిగతా ఆర్టిస్టుల పెర్  ఫార్మెన్స్ సైక్ సిద్దార్ధ ని చూస్తున్నంత సేపు బోర్ కొట్టకుండా చేసాయి. ఫన్ గ్యారంటీ.

 


రేటింగ్ 2 .5 /5                                                                        

                                                                                                       అరుణాచలం 
 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.