ప్రభాస్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన అగ్ర నిర్మాత!
on Dec 23, 2022
తెలుగులో వైజయంతి మూవీ సంస్థకు ఉన్న పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసినవే. టాలీవుడ్ లో ప్రముఖ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో ఈ బ్యానర్ పేరు ముందుగా చెప్పుకోవాలి. నాడు సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదగా ప్రారంభమైన ఈ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు.... వంటి వారి నుండి మెగాస్టార్ చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్, అల్లు అర్జున్,మహేష్ బాబు, పవన్ కళ్యాణ్...ఇలా ప్రతి అగ్రహీరోతో భారీ ప్రాజెక్టు చిత్రాలను నిర్మించింది. అయితే ఆ మధ్య ఈ సంస్థకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి రావోయి చందమామ, ఆజాద్, సుభాష్ చంద్రబోస్, జై చిరంజీవా, సైనికుడు, కథానాయకుడు, కంత్రి, శక్తి ... ఇలా భారీ పరాజయాలతో అశ్వనీదత్ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది.
ఇదే సమయంలో ఆయన కుమార్తె స్వప్నదత్ స్వప్న సినిమా బేనర్‌లో మీడియం బడ్జెట్ చిత్రాలైన స్టూడెంట్ నెం.1, ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతిరత్నాలు, సీతారామం వంటి హిట్ చిత్రాలు నిర్మించింది. ఆమె తీసిన చిత్రాలలో తారకరత్నతో తీసిన ఒకటో నెంబర్ కుర్రాడు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా ఈ చిత్రం ఆడియో మంచి హిట్ అయింది. ప్రస్తుతం అశ్విని దత్ తన కెరీర్ మొత్తం మీదనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు.తన కూతురు స్వప్న భర్త , తన అల్లుడు అయిన దర్శకుడు అయిన నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి విజయాలు ఇచ్చిన ఆత్మబలంతో ప్రభాస్ హీరోగా ప్రాజెక్టు కే అనే చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు కాగా లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును మెంటార్‌గా పెట్టుకున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ కె చిత్రం టైం ట్రావెల్ కథాంశంతో రూపొందుతోంది.
ఎన్నోఏళ్ల కిందటే బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 చిత్రం తీసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ అనుభవం ప్రాజెక్ఠ్ కె కు ఉపయోగపడుతుందనే సింగీతంను ముందు చూపుతో అశ్వనీదత్ దర్శక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాడని అర్ధమవుతోంది. మరోవైపు ప్రభాస్ ఆది పురుష్. సలార్, మారుతి సినిమాలతో బిజీగా ఉండి ప్రాజెక్టు కే ని కూడా పూర్తి చేస్తున్నాడు. తాజాగా అశ్వినీ దత్ ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ యావత్ ప్రపంచంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ అంటే కేవలం టాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే కాదు.... బాలీవుడ్తో పాటు ఇతర భాషల దర్శకులు, బాలీవుడ్ దర్శకులు కూడా ఆయనతో చిత్రాలు తీయాలని ఆరాటపడుతున్నారు. హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ప్రభాస్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభాస్ కేవలం హాలీవుడ్ సినిమాలు మాత్రమే చేసిన కూడా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.... అని చెప్పుకొచ్చాడు మొత్తానికి తన ద్వారానే ప్రభాస్ ని పాన్ వరల్డ్ హీరోగా నిలబెట్టి ప్రభాస్ పై ప్రశంసలు కురిపించి ఆయన ఆకాశానికి ఎత్తేసే భజన కార్యక్రమం పెట్టుకుని ప్రాజెక్ట్ కె తర్వాత కూడా దత్‌ని ప్రభాస్ మర్చిపోకుండా ఉండేందుకే ఈ వ్యాఖ్యలు చేశాడని దత్ మనస్తత్వం బాగా ఎరిగిన వారు అంచనా వేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
