ట్రైలర్ రివ్యూ : ప్రేమమ్
on Sep 21, 2016
మలయాళంలో క్లాసిక్ అనదగ్గ చిత్రం.. ప్రేమమ్. ఈమధ్య కాలంలో ప్రేమమ్ సృష్టించిన మాయ అంతా ఇంతా కాదు. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అదే పేరుతో. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు. శ్రుతిహాసన్, మడోనా, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటించారు. తాజాగా ట్రైలర్ బయటకువచ్చింది. ప్రేమమ్‌లోని మ్యాజిక్ రీమేక్‌లోనూ చూపించడానికి, ఈ సినిమాని ఓ విజువల్ ఫీస్ట్ గా తీర్చిదిద్దడానికి చిత్రబృందం బాగానే కష్టపడిందని అర్థమవుతోంది. అయితే 95 సెకన్ల పాటు సాగే ఈ ట్రైలర్లో `ఈ సినిమా చూసి తీరాల్సిందే` అని పించే మెరుపులు కనిపించలేదు.
ప్రేమ గురించి నాగచైతన్య చెప్పే డైలాగ్ సుదీర్ఘంగా సాగినా.... ఎందుకో అంతగా కిక్ ఇవ్వలేదు. ఈ సినిమా ఓ ఎమోషన్ జర్నీ. అందుకు సంబంధించి ఒక్క ఫ్రేమ్ కూడా ట్రైలర్లో కనిపించకపోవడం పెద్ద లోటే. ప్రేమమ్ మలయాళం వెర్షన్ సినిమా చూసినోళ్లకు, ఆ సినిమా గురించి తెలిసినోళ్లకు ఈ ట్రైలర్ అంతగా ఆనకపోవొచ్చు. అక్కినేని అభిమానులకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే చైతూ మూడు గెటప్పుల్లో అదరగొట్టాడు. ఈ ట్రైలర్లో వినిపించిన నేపథ్య సంగీతం కూడా వినసొంపుగా ఉంది. అయితే అంతమ ఫలితం బాగుండాలంటే.. ఈ సినిమా ప్రేమమ్కంటే బాగుండాలి. కనీసం దరిదాపుల్లోకి వెళ్లగలిగినా.. ప్రేమమ్ టీమ్ కృషి ఫలించినట్టే.