ప్రభాస్ సంచలన నిర్ణయం.. ఆ డైరెక్టర్ తో రెండో సినిమా!
on Mar 14, 2025

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో టక్కున చెప్పమంటే అభిమానులు కూడా తడబడతారు. మిగాతా స్టార్స్ కి సాధ్యంకాని విధంగా వరుస భారీ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్షన్ లో 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ తర్వాత స్పిరిట్, సలార్-2, కల్కి-2 తో పాటు ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరో కొత్త సినిమా కమిట్ అయ్యాడన్న వార్త ఆసక్తికరంగా మారింది. అది కూడా ప్రస్తుతం తాను వర్క్ చేస్తున్న డైరెక్టర్ హను రాఘవపూడితోనే.. ప్రభాస్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఫౌజి' చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అయితే హను టాలెంట్ మెచ్చిన ప్రభాస్.. ఆయనతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే హోంబలే ఫిలిమ్స్ నుంచి హనుకి అడ్వాన్స్ కూడా ఇప్పించినట్లు సమాచారం.
హోంబలే ఫిలిమ్స్ లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయిన విషయం తెలిసిందే. అందులో ఒకటి సలార్-2 కాగా, మిగతా రెండు సినిమాలకు ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు హను ప్రాజెక్ట్.. ఆ మూడు సినిమాల్లో ఒక దాని ప్లేస్ లో ఉంటుందా? లేక ఇది నాలుగో ప్రాజెక్ట్ ఆ? అనేది తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



