ఫ్యాన్స్ గురించి ఆలోచించే ఆ పోస్ట్ చేసావా ప్రభాస్..625 కోట్లు దాటాయి కదా!
on Jan 1, 2024

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 625 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటిన సలార్ పలు బాక్సాఫీస్ రికార్డులను కూడా క్రియేట్ చేస్తోంది. ఇలాంటి టైం లో ప్రభాస్ తన ఇనిస్టాగ్రమ్ లో చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండియన్ సినిమా అయ్యింది.
ప్రభాస్ ప్రస్తుతం సలార్ ఘన విజయం మూడ్ లో ఉన్నాడు. లేటెస్ట్ గా తన ఇనిస్టాగ్రామ్ లో సలార్ కి ఇంత భారీ విజయాన్ని అందించిన ఫ్యాన్స్ కి ఆడియెన్స్ కి చాలా థ్యాంక్స్ అలాగే నేను ఖాన్సార్ ఫేట్ డిసైడ్ చేసేలోగా మీరు న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేస్తూ ఉండండి అంటూ అదిరిపోయే ట్వీట్ చేసాడు. అలాగే సలార్ ను ఓన్ చేసుకుని ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు డార్లింగ్స్ అందరికీ థ్యాంక్స్ అంటూ కూడా పోస్ట్ చెయ్యడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే డైరెక్ట్ గా ప్రభాసే తమని ఉద్దేశించి డార్లింగ్స్ అంటూ పోస్ట్ చేసేసరికి ఫ్యాన్స్ ని ఆపటం ఇప్పుడు ఎవరి తరం కావటం లేదు. అలాగే ప్రభాస్ పోస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రిప్లై లు కూడా ఇస్తున్నారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాను రూపొందించాడు.మొన్న డిసెంబర్ 22న రిలీజైన సలార్ మరే ఇండియన్ మూవీ సాధించనంతగా రికార్డు స్థాయిలో మొదటి రోజు 178.7 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని సాధించింది. ఓవర్సీస్ లోను సలార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే పనిలో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



