పూజాహెగ్డే జోడి ఎవరో తెలిసిపోయింది! ఇతనే ఆ హీరో
on Jul 5, 2025

తెలుగులో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించి అగ్ర హీరోయిన్ స్థాయికి వెళ్లిన నటి 'పూజాహెగ్డే'(Pooja hegde). 2022 లో రిలీజైన 'ఆచార్య' తర్వాత పూజాకి తెలుగులో ఎలాంటి సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. హిందీలో మాత్రం కిసీకా భాయ్ కిసీకా జాన్, సర్కస్, దేవా వంటి చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది సూర్య(Suriya)హీరోగా వచ్చిన 'రెట్రో మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షకులని పలకరించింది.
రీసెంట్ గా పూజా కి స్టార్ హీరో ధనుష్(Dhanush)పక్కన నటించే అవకాశం వచ్చినట్టుగా కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు విగ్నేష్ రాజా(Vignesh Raja)దర్శకత్వంలో తెరకెక్కే పీరియాడిక్ జోనర్ లో నటించడానికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోనే హీరోయిన్ గా పూజా చెయ్యబోతుందని, త్వరలోనే మేకర్స్ నుంచి అధికార ప్రకటన రానుందని సమాచారం. ధనుష్ వరుస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో పూజా, ధనుష్ కి జోడి కడితే పాన్ ఇండియా లెవల్లో పూజా తన సత్తా చాటే అవకాశం ఉందని సినీ పరిశీలకులు అంటున్నారు.
పూజా ప్రస్తుతం రజనీకాంత్, నాగార్జున, లోకేష్ కనగరాజ్ ల 'కూలీ'(Coolie)లో ఒక ప్రత్యేక గీతంలో చేస్తుంది. రాఘవ లారెన్స్ తెరకెక్కించబోయే కాంచన 4 లో హీరోయిన్ కూడా పూజానే.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



