మెడికోగా పూజా హెగ్డే?
on Apr 17, 2021
`ఆచార్య`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`, `రాధేశ్యామ్`.. ఇలా తక్కువ గ్యాప్ లోనే మూడు ఆసక్తికరమైన చిత్రాలతో పలకరించబోతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. `ఆచార్య`లో నీలాంబరిగా స్పెషల్ రోల్ లో దర్శనమివ్వనున్న పూజ.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`లో స్టాండప్ కమెడీయన్ విభా పాత్రలో కనిపించనుంది. ఇక పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న పిరియడ్ రొమాంటిక్ సాగా `రాధేశ్యామ్`లో ప్రేరణ అనే పాత్ర పేరుతో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `రాధేశ్యామ్`లో పూజా హెగ్డే పాత్ర ఏమిటో ఇప్పటివరకు అంతగా క్లారిటీ లేని నేపథ్యంలో.. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. మెడికో రోల్ లో పూజ కనిపిస్తుందట. మెడికల్ స్టూడెంట్ అయిన ప్రేరణతో పెద్ద కార్ల కంపెనీకి అధినేత అయిన విక్రమాదిత్య (యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్) ఎలా ప్రేమలో పడ్డాడు? ఆ తరువాత వారి ప్రేమకథ ఏ తీరాలకు చేరింది? అన్నదే `రాధేశ్యామ్` స్టోరీ లైన్ అని టాక్. మరి.. పూజ పాత్రపై వస్తున్న వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`జిల్` రాధాకృష్ణ రూపొందిస్తున్న `రాధేశ్యామ్`.. జూలై 30న థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read