గంటన్నరపాటు పోలీసువిచారణలో ప్రీతి
on Jun 25, 2014
.jpg)
బాలీవుడ్ నటి ప్రీతి జింటా మంగళవారం పోలీసులకు తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. వ్యాపారవేత్త, మాజీ ప్రియుడు నెస్ వాడియాతో ఆమెకు విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మే 30వ తేదిన వాంఖడే స్టేడియంలో వాడియా తనను వేధించినట్లు ఆమె పోలీసులకు జూన్ 12 న ఫిర్యాదు చేసింది. అదే స్టేడియంలో మంగళవారం ఆమె తన వాంగ్మూలాన్ని పోలిసులకు ఇచ్చారు. ఈ వాంగ్మూలం రికార్డు చేయడానికి గంటన్నర సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా కింగ్స్-11 పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో వాడియా తనను వేధించినట్లు, తనని అగౌరవ పరిచినట్లు ప్రీతిజింటా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఘటన అనంతరం ఆమె అమెరికా వెళ్లిపోయింది. కేసు విచారణ నిమిత్తం పోలీసులు ఆమెను ఇండియాకు రావలసిందిగా కోరారు. ఆదివారం ముంబై వచ్చిన ప్రీతి మంగళవారం నాడు పోలీసులకు, వాంఖడే స్టేడియంలలో తన స్టేట్‌మెంటును ఇచ్చారు. ఘటనా సమయంలో జరిగిన ప్రతి విషయాన్ని ఆమె పోలీసులకు వివరంగా తెలియచేసినట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



