ఇది కదా కావాల్సింది చరణ్.. చికిరి కి భలే అర్ధం చెప్పావు
on Nov 5, 2025

-రామ్ చరణ్ దూకుడు
-పెద్ది ఫస్ట్ సాంగ్ ఈ నెల 7
-అభిమానుల హంగామా
-చికిరి కి అర్ధం తెలుసా!
పెద్ది తన వేగాన్ని పెంచబోతున్నాడు. పైగా ఒక మాదిరిగా కూడా కాదు. తన ఉత్తరాంధ్ర స్టైల్లోనే 'నాను సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్ ని నిజం చేసేస్తాను కదేటి' అనేలా 'చిరుత'లా శరవేగంగా దూసుకురాబోతున్నాడు. ఇందుకు 'పెద్ది' ని ముస్తాబు చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు, లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ లే సాక్ష్యం. దీంతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం రానుంది.
మేకర్స్ రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా 'పెద్ది' నుంచి 'చికిరి' అనే ఫస్ట్ సింగల్ ని ఈ నెల 7 న రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమోలో 'రామ్ చరణ్' ఊరమాస్ లుక్ లో బీడీ కాలుస్తు మాస్ స్టెప్ తో కనపడ్డాడు. ఈ ఒక్క మూమెంట్ తో సాంగ్ ఎలా తెరకెక్కబోతుందో, చరణ్ డాన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధమవుతుంది. ఇక ఇదే ప్రోమోలో దర్శకుడు బుచ్చిబాబు. రెహమాన్ లు ;చికిరి' సాంగ్ సిట్యువేషన్ గురించి కూడా మాట్లాడటం జరిగింది.
అందులో బుచ్చిబాబు సాంగ్ సిట్యువేషన్ ని వివరిస్తు హీరో కొండల్లో నివసిస్తు ఉంటాడు. ఫస్ట్ టైమ్ విలేజ్ లో ఒక అమ్మాయిని చూసి తన ఫ్రెండ్ తో ఆ అమ్మాయి గురించి మాట్లాడుతు 'కాటుక అక్కర్లేని ఆ కళ్ళు.ముక్కు పుడక అక్కర్లేని ఆ ముక్కు. అసలు అలంకరణ అక్కర్లేని ఒక అరుదైన చికిరి రా అని అంటాడు.
Also read: మీకు పుణ్యం ఉంటుంది బాబు
ఆ మాటకి రెహ్మాన్ స్పందిస్తు చికిరి అంటే ఏంటి అని అడిగాడు. బుచ్చిబాబు మాట్లాడుతు పెద్ది వాళ్ళ ఊళ్ళో తను చెప్పిన లక్షణాలు ఉన్న ఆడవాళ్ళని చికిరి అని పిలుస్తారని చెప్తాడు. ఇపుడు ఈ ప్రోమో రిలీజైన నిమిషాల్లోనే రికార్డు వ్యూస్ ని సాధిస్తుంది. దేవర భామ జాన్వీ కపూర్ పెద్దిలో చరణ్ సరసన ఆచ్చాయ మ్మ అనే క్యారక్టర్ లో చేస్తున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు. చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 26 2026 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



