అల్లుఅర్జున్ విషయంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..మరణం చాలా పెద్దది
on Dec 28, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.నిన్న అన్నమయ్య జిల్లా గాలివీడు ఏంపిడివో జవహర్ బాబుపై వైసిపీ కి చెందిన కొంత మంది దాడి జరపడంతో ప్రస్తుతం జవహర్ బాబు కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు.దీంతో పవన్ కళ్యాణ్ కడపలోని రిమ్స్ హాస్పిటల్ కి వచ్చి జవహర్ బాబు ని పరామర్శించి దోషులని కఠినంగా శిక్షిస్తామని చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా కొంత మంది మీడియా వాళ్ళు పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్(allu arjun)అరెస్ట్ తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ గా నిలిచింది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడిగింది.అప్పుడు పవన్ మాట్లాడుతు ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకయ్యా, ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే,మీరు కూడా పెద్దగా ఆలోచించండి బియాండ్ సినిమా అని చెప్పుకొచ్చాడు
ఇక పవన్ వచ్చాడనే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పవన్ మాట్లాడుతున్న సమయంలో ఓజి,ఓజి(og)అని అరవడం మొదలుపెట్టారు.దీంతో పవన్ అభిమానులని ఉద్దేశించి ఏంటయ్యా మీరు,ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదు పక్కకి రండంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసాడు. పవన్ ప్రస్తుతం హరిహరవీరమల్లు,ఓజి షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నాడు.ఈ రెండిటిలో ముందుగా వీరమల్లు మార్చి 28 న వీరమల్లు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
Also Read