'గోపాల గోపాల' రెస్ట్ తీసుకుంటున్నాడు
on Aug 20, 2014
.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా గోపాల గోపాల మూవీ షూటింగ్ బిజీగా గడిపాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రముఖ భాగం చిత్రీకరణ పూర్తికావడంతో కొన్ని రోజులు విరామం తీసుకోవాలనుకుంటున్నాడు. కామన్ గా పవన్ కళ్యాణ్ ఏదైనా మూవీ షూటింగ్ అయిపోయిన వెంటనే ఫారిన్ కి వెళ్ళి కొంత కాలం అక్కడ విశ్రాంతి తీసుకోవడం ఆయనకి అలవాటు. అయితే ఈసారి రాజకీయాల్లోకి రావడం వల్ల ఇండియాలోనే వుండాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన బెంగుళూరులో రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన తెలంగాణ సమగ్ర సర్వేలో కూడా పాల్గొనలేదని సన్నీహితులు అంటున్నారు.మరో వైపు గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్స్ ని మొదలు పెట్టారట. గబ్బర్ సింగ్ 2 కూడా త్వరగా కంప్లీట్ చేసి క్రియాశీల రాజకీయాలలోకి రావాలని పవన్ ఆలోచన.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



