పవన్ కల్యాణ్ చెప్పే వరకూ నమ్మలేమా?
on Nov 4, 2019
పవన్ కల్యాణ్ హిందీ హిట్ 'పింక్' రీమేక్ చేయడం ఖాయమని అటు ఇండస్ట్రీలో, ఇటు మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. పవన్ దగ్గరకు దర్శకులు క్రిష్, హరీష్ శంకర్ కథలు పట్టుకుని తిరుగుతున్నారు. పవన్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఈలోపు బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేయడం, ఆ ట్వీట్‌ని నిర్మాత బోనీ కపూర్ రీట్వీట్ చేయడంతో పవన్ రీఎంట్రీపై మెజార్టీ జనాల్లో ఓ స్పష్టత వచ్చింది. పవన్ నుండి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. సరిగ్గా ఏడాది క్రితం ఒక నిర్మాణ సంస్థ నుండి పవన్ సినిమా చేస్తున్నారని ప్రకటన వచ్చింది. అటువంటిది ఏమీ లేదని పవర్ స్టార్ స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు అలా చేయలేదు. ఎందుకంటే... పవన్ కథలు వింటున్నారని స్వయంగా రామ్ చరణ్ కూడా చెప్పాడు. కానీ, ఒక్కటే సమస్య! ఎవరి కథకు పవన్ ఓటు వేస్తారనేది? పవన్ నుండి అధికారంగా ప్రకటన వచ్చేవరకు ఎవరి దర్శకత్వంలో, ఏ నిర్మాణ సంస్థకు సినిమా చేస్తారనేది ఘంటాపథంగా చెప్పలేం. ఈ ప్రకటనలను నమ్మలేం.
Also Read