ఇది కదా అసలు సిసలైన ఫైట్ అంటే: పవన్ vs మహేష్
on May 29, 2017

సాధారణంగా హీరోలు తమ సినిమా పండగలు లేదా ఇతర సెలవుల సమయంలో విడుదల చేసేలా సన్నాహాలు చేసుకుంటారు. కాబట్టి, పెద్ద పండగలకి పోటీ కొంచెం గట్టిగానే ఉంటుంది. హీరోలు వీటిని సర్వసాధారణంగా తీసుకున్న ఫాన్స్ మాత్రం, తమ హీరో సినిమానే పెద్ద హిట్ అవుతుందని అనవసర హడావిడి చేస్తారు. అందరి హీరోల విషయం పక్కన పెడితే, పోటీ ఉన్న లేక పోయిన మహేష్ బాబు మాత్రం తన సినిమా ఖచ్చితంగా పండగల సమయంలో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటాడు... మరి హాలిడేస్ ని క్యాష్ చేసుకోవాలంటే అదే బెస్ట్ ఆప్షన్ కదా. అయితే, ఈ సారి మాత్రం గట్టి పోటీ తప్పేట్టు లేదు. మహేష్ బాబు స్పైడర్ దసరా కానుకగా విడుదలవనుండగా... పవన్ కళ్యాణ్, త్రివిక్రంతో చేస్తున్న సినిమా కూడా అదే టైం కి వస్తుందని సమాచారం.
ఇదే గనక నిజమయితే... మొదటి సారి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ ఫైట్ చూడబోతున్నాం. ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరో స్థానానికి పోటీ ఎక్కువగానే ఉంది... అయితే, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందు వరసలో ఉంటారు. ఈ ఇద్దరు ఒకరి రికార్డులు ఇంకొకరు బద్దలు కొట్టడం మనం చూస్తూ వస్తున్నాం... కానీ, దసరాకి ఇరువురు తెలుగు ప్రేక్షకులకి అసలు సిసలైన విందు భోజనం సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకి భారీ అంచనాలు ఉండడంతో, ఎవరి సినిమా భారీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ బెట్టింగులు కట్టడం ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



