ఆగస్ట్ 24 నుంచి ఎన్టీఆర్ హవా..పవర్ హౌస్ కి సిద్దమని ప్రకటన
on May 20, 2024
ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr)అభిమానులని ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల మూడ్ లో ఉన్న వాళ్ళకి ఒక నయా వార్త అంబరాన్ని అంటే ఆనందాన్ని కలుగ చేస్తుంది.నిజం చెప్పాలంటే ఈ రోజు కోసమే ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వాళ్ళ మొర ఏ దేవుడు ఆలకించాడో గాని ఇన్నాళ్ళకి వాళ్ళ ఆశలు ఫలించాయి
ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ (prashanth neel)కాంబోలో ఒక మూవీ ఉందనే విషయం అందరకి తెలిసిందే. కాకపోతే ఎన్టీఆర్, ప్రశాంత్ లు ఉన్న బిజీ దృష్ట్యా మూవీ స్టార్టింగ్ విషయంలో క్లారిటీ లేదు.పైగా అధికారంగా ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు. దీంతో ఈ కాంబో త్వరగా తెరకెక్కాలని అభిమానులు, ప్రేక్షకులు తమ తమ ఇష్ట దైవాల్ని వేడుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ టీం అప్ డేట్ ఇచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్తు అగస్ట్ నుంచి షూటింగ్ అని అనౌన్స్ చేసింది. దీంతో దేవర ఫస్ట్ సాంగ్ అండ్ ప్రశాంత్ మూవీ వార్త ఫ్యాన్స్ కి డబుల్ ధమాకాని తెచ్చినట్టయ్యింది
పవర్‌హౌస్ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అని కూడా టీం చెప్తుంది .ఇక ఫ్యాన్స్ కి అయితే కథ ఎలా ఉండబోతుంది. ఎన్టీఆర్ క్యారక్టర్ ఎలా ఉండబోతుంది అంటు చర్చలు కూడా మొదలెట్టారు. ఒక లెవల్లో టైటిల్స్ ఫిక్స్ చేసే ప్రశాంత్ ఇప్పుడు ఎన్టీఆర్ మూవీకి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తాడు అనే చర్చ కూడా ఫ్యాన్స్ లో నడుస్తుంది. సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది.మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ లు కంబైన్డ్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్, దేవర, వార్ ల తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే మూవీ ఇదే
Also Read